ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 01:35:14

కూష్మాండ దుర్గా.. పాహిమాం

కూష్మాండ దుర్గా.. పాహిమాం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: శరన్నవరాత్రోత్సవాలు కన్నులపండువలా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భా గంగా నాలుగో రోజైన మంగళవారం అమ్మవారు కూ ష్మాండదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలంలో కూష్మాండ దుర్గ సాత్విక రూపంలో సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేములవాడ, జో గుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌, మెదక్‌ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత లయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూలా నక్షత్రం కావడంతో బాసర ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీమహాలక్ష్మీ అమ్మవారు ధనలక్ష్మీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు ఆలయంలో అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. వరంగల్‌ భద్రకాళి దేవస్థానంలో అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం పూజానంతరం సూర్యప్రభ వాహనంపై, సాయంకాలం హంస వాహనంపై అమ్మవారిని ఊరేగించారు.