గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 20:57:20

అంకాపూర్‌ను సందర్శించిన కర్నూల్‌ రైతులు

అంకాపూర్‌ను సందర్శించిన కర్నూల్‌ రైతులు

ఆర్మూర్  : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్‌ గ్రామాన్ని  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌ జిల్లా రైతులు సందర్శించారు. అంకాపూర్‌ రైతులు సాగుచేసిన పంటలను క్షేత్రస్థాయిలో వారు పరిశీలించారు. పంటల సాగు విధానాలు, గ్రామస్తుల ఐక్యత, గ్రామాభివృద్ధికి అవలంబిస్తున్న విధానాల గురించి కర్నూలు రైతులు అడిగి తెలుసుకున్నారు. అంకాపూర్‌ రైతు సంఘం మాజీ కార్యదర్శి కేకే భాజన్న వారితో కలిసి పంటలను పరిశీలించారు. 


logo
>>>>>>