బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 09:45:04

కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు క‌న్న‌మూత‌

కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు క‌న్న‌మూత‌

హైదరాబాద్: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు కన్నుమూశారు. ఆమె గ‌త కొంత‌కాలంగా న్యూరోస‌ర్జిక‌ల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. రెండువారాలుగా నగరంలోని ఓ ప్రైవేటు ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.  

తెలుగు రాష్ట్రా‌ల్లోనే కాకుండా దేశ, విదే‌శాల్లో తన నృత్య ప్రద‌ర్శ‌న‌లతో కూచిపూడి నాట్య కళాకారిణిగా గుర్తింపు పొందారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు జన్మించారు. వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేసిన ఆమె..12 ఏండ్ల వ‌య‌స్సులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు. స‌త్య‌భామ‌, ప‌ద్మావ‌తి పాత్ర‌ల్లో ఆమె రాణించారు. హైద‌రాబాద్ కూచిపూడి ఆర్ట్ అకాడ‌మీకి ప్రిన్సిప‌ల్‌గా ప‌నిచేశారు. కూచిపూడి నృత్యంలో వంద‌ల మందికి శిక్ష‌ణ ఇచ్చారు. 

నాట్య ప్రదర్శనల్లో తన ప్రతిభను చాటి రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలెన్నో గెలుచుకున్నారు. 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1998లో ఎన్టీఆర్ పుర‌స్కారం, 1991లో సంగీత నాట‌క అకాడ‌మీ అవార్డు, 19821లో నిత్య చూడామ‌ణి పుర‌స్కారం అందుకున్నారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo