శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 13:12:51

కేయూ పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

కేయూ పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌ : రేపటి నుంచి జరగాల్సిన కాకతీయ యూనివర్సిటీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ బుధవారం ప్రకటించారు. మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీని వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు గమనించాలని ఆయన సూచించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 8 నుంచి ఎక్కడి విద్యార్థులకు అక్కడే పరీక్షలు రాసేందుకు వర్సిటీ ఏర్పాట్లు చేసింది. పరీక్షలు జరిగే యూనివర్సిటీలు, పట్టణాల వివరాలను కేయూ పరీక్షల ప్రకటించారు. కాగా, పరీక్షల వాయిదాకు గల కారణాలు తెలియరాలేదు. త్వరలోనే పరీక్షలు నిర్వహించే తేదీని ప్రకటిస్తామని యూనివర్సిటీ తెలిపింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు