మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 21:34:22

రేపు, ఎల్లుండి జరగాల్సిన కేయూ పరీక్షలు వాయిదా

రేపు, ఎల్లుండి జరగాల్సిన కేయూ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సోమ, మంగళవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాలుగో సెమిస్టర్‌, డిగ్రీ పరీక్షలు జరగాల్సి ఉంది. 19, 20 తేదీల్లో నిర్వహించాల్సిన ఎగ్జామ్స్‌ను 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. అలాగే అలాగే బీఈడీ దూర విద్య పరీక్షలను సైతం వాయిదా వేసింది. 19, 20 తేదీల్లో జరగాల్సిన ఎగ్జామ్స్‌ను నవంబర్‌ 2, 3 తేదీల్లో జరుపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను యూనివర్సిటీ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో వర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo