గురువారం 09 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 03:13:44

గోదారమ్మ ఉరకలు పొంగుతున్న బందనకల్‌ ఊర చెరువు

గోదారమ్మ ఉరకలు పొంగుతున్న బందనకల్‌ ఊర చెరువు

  • రేపు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా జలహారతి

ముస్తాబాద్‌: బీడు భూములను సస్యశ్యామలం చేసే దిశగా గోదావరి జలాలు ఉరకలేస్తున్నాయి. నెర్రెలు వారిన మెట్టప్రాంత నేలను గోదావరి జలాలు ముద్దాడగా అన్నదాతలు ఆనందంలో మునిగితేలారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం బందనకల్‌ ఊర చెరువు గోదావరి జలాలతో నిండి పొంగిపొర్లుతున్నది. సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌ నుంచి వారం రోజులుగా వస్తున్న గోదావరి జలాలతో బంధనకల్‌ ఊర చెరువు సోమవారంతో నిండింది. దీంతో చెరువు మత్తడి దుంకుతూ బంధనకల్‌ గ్రామ శివారులోని కుంటలోకి జలాలు పరుగులు తీస్తుండటంతో రైతులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఊర చెరువులో పూజలు నిర్వహించేందుకు రావాలని ఎంపీపీ జనగామ శరత్‌రావు తదితరులు సోమవారం హైదరాబాద్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆహ్వానించారు. బుధవారం వచ్చి జల హారతి ఇచ్చేందుకు అంగీకరించారని వారు పేర్కొన్నారు.
logo