ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 13:06:34

చంపేశావ్ చిన్నోడా.. కేటీఆర్ ట్వీట్

చంపేశావ్ చిన్నోడా.. కేటీఆర్ ట్వీట్

పెట్ డాగ్స్‌ను చూస్తే భ‌లే క్రేజీ అనిపిస్తోంది. అవి చేసే అరుపుల‌కు హుషారుగా ఉండే పిల్ల‌లు ఆట పెడుతారు. కొన్ని సంద‌ర్భాల్లో పెట్ డాగ్స్ అరుపుల‌కు త‌గ్గ‌ట్టుగా పిల్ల‌లు స్టెప్పులేసి ఆట ప‌ట్టిస్తుంటారు. వాటికి కూడా అర్థం కాక అరుస్తూనే ఉంటాయి. ఇలాంటి ఓ క్రేజీ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

రెండు పెట్ డాగ్స్ గేటు లోప‌ల ఉండి అరుస్తుండ‌గా.. గేటు బ‌య‌ట ఉన్న ఓ చిన్నోడు.. డ్యాన్స్ చేసి కాసేపు అంద‌రిని న‌వ్వించాడు. ఆ రెండింటిని బుడ్డోడు ఆట ప‌ట్టించిన వీడియో తెగ న‌వ్వు తెప్పిస్తోంది. ఈ వీడియోను వినేష్ ఖాటారియా అనే జ‌ర్న‌లిస్టు త‌న ట్విట్ట‌ర్ పేజీలో పోస్టు చేశాడు. 

రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్.. ఆ వీడియోను త‌న పేజీలో సోమ‌వారం ఉద‌యం షేర్ చేశారు. డ్యాన్స్‌లో ఏం నైపుణ్యం ఉంది అంటూ ఆ పిల్లాడిని కొనియాడారు. చిన్నోడిని మెచ్చుకుంటూ.. డ్యాన్స్ చంపేశావ్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 


logo