గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 09:08:33

కమాండ్‌ కంట్రోల్‌ ఆపరేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్న కేటీఆర్‌

కమాండ్‌ కంట్రోల్‌ ఆపరేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్న కేటీఆర్‌

హైదరాబాద్‌ : గచ్చి‌బౌ‌లి‌లోని సైబ‌రా‌బాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యా‌ల‌యంలో అత్యా‌ధు‌నిక సాంకే‌తిక పరి‌జ్ఞా‌నంతో ఏర్పా‌టు ‌చే‌సిన పబ్లిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ అండ్‌ డేటా సెంటర్‌ను ఇవాళ మంత్రి కేటీ‌ఆర్‌ ప్రారం‌భిం‌చ‌ను‌న్నారు. సేఫ్‌ అండ్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా ప్రతిష్టాత్మకంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రభుత్వం నిర్మించింది. ఏకకాలంలో భారీ తెరపై ఐదువేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే అవకాశం ఉంది. 10లక్షల కెమెరాలకు సంబంధించిన దృశ్యాల్ని నెల రోజుల పాటు నిక్షిప్తం చేసేలా భారీ సర్వర్లు ఏర్పాటు చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో 14 మీటర్ల పొడవు, 42 మీటర్ల ఎత్తుతో అర్ధ చంద్రాకారంలో భారీ తెర, దాని పక్కనే రెండు వైపులా 55 అంగుళాల సామర్థ్యం గల మరో నాలుగు టీవీ తెరలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను ఇక్కడ నుంచి వీక్షించవచ్చు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.