బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 22, 2020 , 03:27:56

టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రజలు

టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రజలు
  • పోలింగ్‌శాతం ఎంతపెరిగితే అంతమంచిది
  • ఘనవిజయం సాధించబోతున్నాం
  • చివరివరకు అప్రమత్తంగా ఉండాలి
  • టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటు విలువైనదేనని, ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ ఓటువేసేలా   చూడాలని పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉ న్నందున పోలింగ్‌శాతం ఎంతగా పెరిగితే అంత మంచిదని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వెళ్లిన ఆయన మంగళవారం అక్కడినుంచే మున్సిపల్‌ ఎన్నికలపై సమీక్షించారు. రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీసభ్యులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఇంచార్జిలను ఎప్పటికప్పుడు సమన్వయం చేయాలని సూ చించారు. పోలింగ్‌ రోజున నాయకులం తా అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపాలని, ఓటింగ్‌ ముగిసేవరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని సూచించారు. ఉదయమే అధికంగా పోలింగ్‌ జరిగేలా చూడాలని, బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా జరిగే ఎన్నికల్లో సరిగా ఓటువేసేలా అవగాహన కల్పించాలని కోరారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు. 


logo