ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 24, 2020 , 20:57:47

మతం కాదు..జనహితం అనేది కేసీఆర్‌ నినాదం: మంత్రి కేటీఆర్‌

మతం కాదు..జనహితం అనేది కేసీఆర్‌ నినాదం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: ఆరేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మాపై ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.  తెలంగాణ నాయకులకు పరిపాలన రాదని గతంలో హేళన చేశారని గుర్తు చేశారు.  హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా  అంబర్‌పేట్‌ నియోజకవర్గం పటేల్‌నగర్‌ రోడ్‌షోలో  కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.   

'అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకెళ్తోంది.  తెలంగాణ, హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంది.  కరోనా సంక్షోభం దృష్ట్యా ఆస్తి పన్నును ప్రభుత్వం 50శాతం మాఫీ చేసింది. పేదల వైద్యం కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం.  కేసీఆర్‌ కిట్‌ వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నాం.  కులం, మతంతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.  మతం కాదు..జనహితం అనేది కేసీఆర్‌ నినాదం. హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం ఒక్క అభివృద్ధి చేసిందా?  గుజరాత్‌, యూపీ రాష్ట్రాల్లో అభివృద్ధి పనుల్లో తెలంగాణ వాటా ఉంది.  హైదరాబాద్‌లో వరదలు వస్తే ఇప్పటి వరకు ఆర్థిక సాయం చేయలేదని' కేటీఆర్‌ పేర్కొన్నారు.