సోమవారం 08 మార్చి 2021
Telangana - Nov 23, 2020 , 21:21:50

పేదలకు సీఎం కేసీఆర్‌ అంటే ఒక ధీమా: మంత్రి కేటీఆర్‌

పేదలకు సీఎం కేసీఆర్‌ అంటే ఒక ధీమా: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌:  గత  ఆరేళ్లలో ప్రతీ డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నాగోల్‌ దాకా మెట్రో రైలును తీసుకొచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని కేటీఆర్‌ చెప్పారు. హస్తినాపురం డివిజన్‌లో రూ.215 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని,  ఎల్బీనగర్‌ చౌరస్తా రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్‌ వెల్లడించారు. కర్మాన్‌ఘాట్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ రోడ్‌షోలో   కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. 

'పేదలకు సీఎం కేసీఆర్‌ అంటే ఒక ధీమా.  పేదవాడికి అడుగడుగున సాయం చేసే సర్కార్‌ సీఎం కేసీఆర్‌ది. శాశ్వతంగా నీటి బిల్లు  కట్టాల్సిన అవసరం లేదు. 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీటి సరఫరా.  సెలూన్లకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.  కరోనా కష్టకాలంలో అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్నారు.  70 ఏళ్లలో జరగని పనులు ఐదేళ్లలో చేసి చూపించాం. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు ఎందుకు ఓటేయాలి.  హైదరాబాద్‌ అభివృద్ధికి ఏం చేశారని మీకు ఓటేయాలి. వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచింది టీఆర్‌ఎస్సే.  సీఎం కేసీఆర్‌ మానవతా దృక్పథంతో వరద బాధితులకు రూ.10వేలు సాయం అందించారని' పేర్కొన్నారు. 

'తెలంగాణ పైసలతోనే బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నారు.  తెలంగాణకు జాతీయస్థాయి ఇన్‌స్టిట్యూషన్లు ఏవీ ఇవ్వలేదు.  మోదీ ప్రభుత్వం ఐటీఐఆర్‌ను రద్దు చేసింది.  ఉద్వేగాలు కాదు.. పిల్లలకు ఉద్యోగాలు కావాలి. అన్నదమ్ముల్లాగా కలిసున్న హైదరాబాద్‌లో బీజేపీ నేతలు చిచ్చుపెడుతున్నారు.  తెలంగాణలో పక్కా లోకల్‌ పార్టీ టీఆర్‌ఎస్‌. గల్లీ పార్టీ కావాలా, ఢిల్లీ పార్టీ కావాలో ఆలోచించాలి.  హైదరాబాద్‌ గులాబీలు కావాలా, గుజరాత్‌ గులాంలు కావాలా.  అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా.  డిసెంబర్‌ 1వ తేదీన టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని' కేటీఆర్‌ కోరారు. 

VIDEOS

logo