సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 02:37:24

ప్రజల భాగస్వామ్యంతోనే సత్ఫలితాలు

ప్రజల భాగస్వామ్యంతోనే సత్ఫలితాలు

  • ముక్రా(కే) ప్రకృతి పల్లెవనం సూపర్‌
  • ట్విట్టర్‌లో స్పందించిన మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతున్నాయని మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండ లం ముక్రా(కే)లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పల్లె ప్రకృతి వనం చిత్రాలను, వీడియోను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రకృతి వనాన్ని తీర్చిదిద్దిన ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు.  ఇదే విషయంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ ‘ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో మన ప్రయత్నాలన్నీ సఫలం అవుతున్నాయి’ అని ట్వీట్‌ చేయగా మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలుపుతూ రీట్వీట్‌ చేశారు.logo