'సీఎం కేసీఆర్ సింహంలాంటి వారు..సింగిల్‌గానే వస్తరు'

హైదరాబాద్: పొలిటికల్ టూరిస్టులతో హైదరాబాద్ నగరానికి ఒరిగేది ఏమీలేదని, ఎన్నికలు అనగానే డజన్ల కొద్దీ నాయకులు పరుగెత్తుకుని వస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్క నాయకుడు హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడలేదని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆనంద్‌బాగ్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
'కేంద్రం కంటోన్మెంట్లో రోడ్ల సమస్యలు పరిష్కరించలేదు. మేం కొత్తగా రోడ్లు వేస్తుంటే కేంద్రం కంటోన్మెంట్ రోడ్లను మూసివేసింది. రోడ్లు వేసేటోళ్లకు ఓట్లేస్తరా..రోడ్లు మూసేటోళ్లకు ఓట్లేస్తరో ఆలోచించాలి. సీఎం కేసీఆర్ వరద సాయం చేస్తుంటే..బీజేపీ నేతలు అడ్డుకున్నారు. హైదరాబాద్ ప్రజలకు 50శాతం ఇంటిపన్ను రాయితీ ఇచ్చాం. శాంతిభద్రతల కోసం గల్లీగల్లీకి 5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కర్ఫ్యూ పెట్టే పరిస్థితి వస్తే మనకే నష్టం. డిసెంబర్ 4 తర్వాత రూ.10వేలు వరదసాయం ఇస్తాం. 2014 ఎన్నికల సమయంలో రూ.15లక్షలు ఇస్తామన్నారు. రూ.15లక్షలు వస్తే బీజేపీకి.. రాకుంటే కారుకు ఓటేయ్యండి. మతం పేరుతో చిచ్చు పెట్టేవాళ్లు కావాలా..? జనహితం కోరుకునేవాళ్లు కావాలా? తేల్చుకోవాలని' కేటీఆర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- తలైవాకు షాక్: డీఎంకేలోకి రజనీ మాండ్రం నేతలు
- ఫేస్బుక్, ట్విట్టర్లకు కేంద్రం ఝలక్:21న విచారణకు రండి!
- నేడు ఐపీవోకు ఐఆర్ఎఫ్సీ: లక్ష్యం రూ.4,633 కోట్ల సేకరణ
- గోస్వామికి బాలాకోట్ దాడి ముందే తెలుసా?!
- హిందూ మనోభావాలు దెబ్బతీసేలా తాండవ్?!
- ఆదాతో కష్టాలకు చెక్: బీ అలర్ట్..
- మాస్క్.. మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు
- ఎస్వీబీసీకి రూ.1.11 కోట్ల విరాళం
- రేపు అంగన్వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ
- జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్ కలకలం