బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 20:28:46

కొడంగల్‌ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి కేటీఆర్‌

కొడంగల్‌ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: కొడంగల్‌ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలు అపార నమ్మకంతో టీఆర్‌ఎస్‌ను గెలిపించారని, వారి ఆకాంక్షలు నెరవేరుస్తామని కేటీఆర్‌ తెలిపారు. కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులు   సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట్‌ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. 

'ప్రజల ఆకాంక్షల మేరకు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం.  నియోజకవర్గంలో అవసరమైన చోట్ల సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేసేందుకు విద్యుత్‌ శాఖ తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న పనులు వేగంగా జరగాలి. నియోజకవర్గ భవిష్యత్‌ అవసరాల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళిక రూపొందించాలని' కేటీఆర్‌ సూచించారు. logo