ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 18, 2020 , 13:05:58

భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకురండి.. కేటీఆర్‌ ట్వీట్‌

భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకురండి.. కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌, విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ ఎస్‌ పూరికి ట్వీట్‌ చేశారు. మనీలా, కౌలాలంపూర్‌, రోమ్‌ విమానాశ్రయాల్లో దేశానికి చెందిన విద్యార్థులు చిక్కుకున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా తనకు సమాచారం అందిందని, వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కేంద్ర  ప్రభుత్వం వీలైనంత త్వరగా స్పందించి, వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్‌ కోరారు.

కౌలాలంపూర్‌, మనీలా విమానాశ్రయంలో రెండు రోజులుగా తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా దృష్ట్యా పలు దేశాల నుంచి మన దేశానికి వచ్చే విమానాలను నిలిపివేశారు. అధికారులు స్పందించక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, అధికారులు స్పందించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. 


logo