టెక్ తెలంగాణ సూపర్

- రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలు
- మంత్రి కేటీఆర్ నాయకత్వం భేష్
- ప్రపంచ ఆర్థిక ఫోరం అధ్యక్షుడి లేఖ
- ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగంపై టోక్యోలో గ్లోబల్ సదస్సుకు ఆహ్వానం
- తెలంగాణకు మరో అరుదైన గౌరవం
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నిర్వహించే గ్లోబల్ టెక్నాలజీ సదస్సుకు రావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్కు డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రాండే లేఖ రాశారు. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి మంత్రి కేటీఆర్ నాయకత్వంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక లబ్ధికోసం వినియోగించడంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారని లేఖలో ప్రశంసించారు. డబ్ల్యూఈఎఫ్ చేపట్టిన ఏఐఫర్ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్), జీ-20 స్మార్ట్ సిటీస్ అలయన్స్ మొదలైన కార్యక్రమాలకు మద్దతు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకొంటామని బోర్గ్ తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. కొవిడ్ మహమ్మారి నుంచి కోలుకొని దేశాలను పునర్నిర్మించడంలో కీలకపాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ఈ సదస్సు జరుగుతుంది. కొవిడ్ సంక్షోభం అనంతరం దేశాలు తిరిగి వృద్ధిబాట పట్టేందుకు ‘ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగం’ అన్న అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో కొత్త సాంకేతికతను వినియోగిస్తూ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలను మరింతగా ముందుకు తీసుకెళ్లడం, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన ఆవిష్కరణలపై చర్చిస్తారు. వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, మంత్రులు, వ్యాపార, వాణిజ్య రంగాల్లోని ప్రముఖులు సదస్సులో పాల్గొంటారు.
తెలంగాణ ఏర్పడిన నాటినుంచి మంత్రి కేటీఆర్ నాయకత్వంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక లబ్ధికి వినియోగిం చడంలో వినూత్న కార్యక్రమాలు చేపడు తున్నారు. డబ్ల్యూఈఎఫ్ చేపట్టిన పలు కార్యక్రమాలకు మద్దతు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-బోర్గ్ బ్రాండే
తాజావార్తలు
- మరో నాలుగు రోజులు..
- గ్రామాల అభివృద్ధేప్రభుత్వ ధ్యేయం
- ‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396
- నేటి నుంచి నిరంతరాయంగా..
- ఆకాశం హద్దుగా!
- పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
- కోడేరు అభివృద్ధ్దికి కంకణం కట్టుకున్నా
- ప్రభుత్వభూమి ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
- నల్లమల ఖ్యాతి నలుదిశలా విస్తరించాలి