సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 01:12:01

చిన్నారికి కేటీఆర్‌ భరోసా...బ్లడ్‌ క్యాన్సర్‌ చికిత్స కోసం హామీ

చిన్నారికి కేటీఆర్‌ భరోసా...బ్లడ్‌ క్యాన్సర్‌ చికిత్స కోసం హామీ

మల్కాజిగిరి, జనవరి 7: బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్య చికిత్సకు ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన రమేశ్‌ కుమారుడు ఏడేండ్ల విష్ణుతేజ కొంతకాలంగా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఓ ప్రైవేటు దవాఖానలో దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చుచేసి విష్ణుకు ఆపరేషన్‌ చేయించారు. ఆపరేషన్‌ సక్సెస్‌ కాకపోవడంతో తిరిగి నిర్వహించాలని వైద్యులు సూచించారు. బోన్‌మ్యారో ఆపరేషన్‌ మరోసారి నిర్వహించే ఆర్థికస్థోమత లేకపోవడంతో రమేశ్‌.. మల్కాజిగిరి టీఆర్‌ఎస్‌ సర్కిల్‌ ప్రధాన కార్యదర్శి జీఎన్వీ సతీశ్‌కుమార్‌ను కలిశాడు. ఆయన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు సమస్యను వివరించారు. సతీశ్‌, మైనంపల్లి చొరవ చూపి విషయాన్ని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రిపోర్టులను చూపించారు. నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారికి వైద్యసాయం చేస్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. విష్ణుతేజ ఆపరేషన్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. మంత్రి కేటీఆర్‌, మైనంపల్లి, సతీశ్‌కుమార్‌కు రమేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.