మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 15, 2021 , 20:03:40

పండుగవేళ కేటీఆర్‌పై అభిమానం..

పండుగవేళ కేటీఆర్‌పై అభిమానం..

సిరిసిల్ల రూరల్ :జనాకర్షక నేత, మృదు స్వభావి మంత్రి కేటీఆర్‌ను ఎంతో మంది ఇష్టపడుతుంటారు. సందర్భానుసారం తమ అభిమానాన్ని ఏదో ఒక రూపంలో తెలియజేస్తుంటారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్‌పై జిల్లాలో టీఆర్ఎస్ నేతలు, మహిళలు  తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌వై జిల్లా నేత సిలివేరి చిరంజీవి దంపతులు పండుగ వేళ సకినాలపై జై కేటీఆర్ అని రాసిన తినుబండరాలను తయారు చేసి తమ అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. అందమైన ముగ్గులతో పాటు కేటీఆర్‌ పేరు రాయడం విశేషం. కేటీఆర్‌పై అభిమానంతోనే ఇలా చేసుకున్నట్లు వారు సంబురంగా చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి..

పల్లెకు పుట్టినరోజు..పరవశంలో గ్రామస్తులు

‘అక్షరయాన్’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు

క‌వ్వాల్ అభ‌యార‌ణ్యంలో మంత్రి అల్లోల‌ 

మంటల్లో పడి వృద్ధురాలి సజీవదహనం 

VIDEOS

logo