ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 14, 2020 , 20:50:32

కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్: కేంద్ర మంత్రి

కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్: కేంద్ర మంత్రి

హైదరాబాద్‌:  హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న ఏషియాలోనే అతిపెద్ద ఎయిర్‌షో వింగ్స్‌ ఇండియా-2020 కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.   ఏవియేషన్‌ ఎగ్జిబిషన్‌ సందర్శించిన మంత్రులు..ఎయిర్‌షోను వీక్షించారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులు, విమానయాన సంస్ధలకు స్వచ్ఛ అవార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా హర్దీప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.  కేటీఆర్‌ సమర్థవంతమైన, డైనమిక్‌ మంత్రి మాత్రమే కాదు..  న్యూ ఇండియాకు కేటీఆర్‌ ప్రతినిధి అని కొనియాడారు. వింగ్స్‌ ఇండియా సదస్సును విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

ఏరోస్పేస్, ఏవియేషన్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్‌  తెలిపారు.  రీజనల్ కనెక్టివిటీని పెంచే ఉద్దేశంతో తెలంగాణలోని పాత ఎయిర్ పోర్టులను పునరుద్దరిస్తున్నామని చెప్పారు. రీజనల్ ఎయిర్ పోర్టులతో పాటు.. హెలిపోర్ట్, సీ ప్లేన్ లపై తెలంగాణ ఆసక్తిగా ఉందన్నారు. ఏవియేషన్ రంగం 14 శాతం వృద్ది సాధిస్తోందన్నారు.   ఏవియేషన్ రంగంపై జీఎస్టీని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు.logo