ఆదివారం 07 మార్చి 2021
Telangana - Jan 20, 2021 , 14:21:51

సీఎం ప‌ద‌వికి కేటీఆర్ స‌మ‌ర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

సీఎం ప‌ద‌వికి కేటీఆర్ స‌మ‌ర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి కేటీఆర్ స‌మ‌ర్థుడు అని బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్‌, నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు. కేటీఆర్ సీఎం అయితే రాష్ర్టం మ‌రింత అభివృద్ధి చెందుతుంద‌ని ఎమ్మెల్యే ష‌కీల్ పేర్కొన్నారు. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాలు కేటీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గాల‌న్న‌దే త‌న ఆకాంక్ష అని తెలిపారు. యువ నేత కేటీఆర్‌ను సీఎం చేయాల‌ని కోరుతున్నాను. కేటీఆర్‌ను సీఎం చేయాల‌ని యువ ఎమ్మెల్యేల అభిప్రాయ‌మ‌ని ష‌కీల్ స్ప‌ష్టం చేశారు. 

కేటీఆర్ సీఎం అయితే మ‌రింత అభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రెడ్డి. కేటీఆర్‌ను సీఎం చేయాల‌ని కోరుకునే వారిలో తాను కూడా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ ఆలోచించి కేటీఆర్‌ను సీఎం చేయాల‌ని ఎమ్మెల్యే బాజిరెడ్డి కోరారు. 

కేటీఆర్ సీఎం అయితే త‌ప్పేముంది? : మ‌ంత్రి త‌ల‌సాని

కేటీఆర్ సీఎం అయితే త‌ప్పేముంది అని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ త‌గు స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటారు. కేటీఆర్ అన్ని విధాలా స‌మ‌ర్థుడు అని పేర్కొన్నారు. కాళేశ్వ‌రంపై కామెంట్లు చేసే బీజేపీ నాయ‌కుల‌కు బుద్ధి, జ్ఞానం లేదు. అవ‌గాహ‌న లేకుండా కాళేశ్వ‌రంపై మాట్లాడుతున్నారు. ద‌మ్ముంటే బీజేపీ నేత‌లు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మాట్లాడాల‌ని త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ధ్వ‌జ‌మెత్తారు.

VIDEOS

logo