శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 18:25:55

మీ కృషి అద్భుతం కేటీఆర్ స‌ర్‌: యాంక‌ర్ సుమ‌

మీ కృషి అద్భుతం కేటీఆర్ స‌ర్‌: యాంక‌ర్ సుమ‌

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రం, హైద‌రాబాద్ న‌గ‌రం అభివృద్ధికి మంత్రి కేటీఆర్, ఆయ‌న బృందం చేస్తున్న కృషి అద్భుత‌మ‌ని ప్ర‌ముఖ టీవీ వ్యాఖ్యాత సుమ అన్నారు. కేటీఆర్‌తో సంభాషించ‌డం ఎంతో సంతోషంగా అనిపించింద‌ని ఆమె చెప్పారు. ఇవాళ కేటీఆర్‌తో భేటీ అయిన సంద‌ర్భంగా ఆయ‌న‌తో క‌లిసి తీసుకున్న ఫొటోల‌ను సుమ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేటీఆర్ స‌ర్‌తో ముచ్చ‌టించ‌డం చాలా ఆనందంగా అనిపించిందని చెప్పారు. 

ఓ హైద‌రాబాదీగా మ‌న న‌గ‌రం అభివృద్ధి గురించి తెలుకోవాల్సి అంశాలు చాలా ఉన్నాయ‌న్నారు. మీకు, మీ బృందానికి కుదా హ‌ఫీజ్ స‌ర్ అని కేటీఆర్‌ను ఉద్దేశించి సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. నేను టీవీ షోల్లో గ‌డ‌గ‌డ మాట్లాడుతుంటాన‌ని, కానీ మీ నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు మీరు చెప్పేది శ్ర‌ద్ధ‌గా వినేలా చేశాయి. ప్ర‌క‌ట‌న చేయ‌డం, అంకితభావంతో ప‌నిచేయ‌డం, అమ‌లు చేయ‌డం మీ మార్గాలు. సూప‌ర్ స‌ర్ అని సుమ ట్వీట్ చేశారు. కాగా, మీతో సంభాష‌ణ‌ను నేను ఎంజాయ్ చేశాను సుమ‌గారు. ఈ వీడియో చూసే ప్ర‌జ‌లు కూడా అలాగే ఎంజాయ్ చేస్తార‌ని ఆశిస్తున్నా అని సుమ‌కు కేటీఆర్ రిప్లై ఇచ్చారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.