ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 20:01:28

కేటీఆర్ పుట్టినరోజు కానుకగా.. అరుదైన బహుమతి

కేటీఆర్ పుట్టినరోజు కానుకగా.. అరుదైన బహుమతి

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పార్టీ రాష్ట్ర నాయకుడు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఓ అపురూపమైన కానుకను అందించారు. కేటీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, పొలిటికల్ కెరియర్, విజయాలు, ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలు, ప్రజలకోసం చేసిన పోరాటాలు,  హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ చేసిన కృషిని వివరిస్తున్న దృశ్య మాలికలతో ఉప్పల శ్రీనివాస్ ఓ పెయింటింగ్ ను వేయించారు. 

సామాజిక అంశాలపై పెయింటింగ్స్ వేసే కందుకూరి వెంకటేశ్ తో అద్భుతమైన దృశ్య రూపం గీయించారు. ఈ భారీ చిత్రంలో కేసీఆర్ లాంతర్ తో ధైర్యంగా నడుస్తుంటే వెనకాలే కేటీఆర్ నవ్వుతూ నడుస్తున్నట్టు, అంధకారం నుంచి వెలుగులను కేటీఆర్ చూస్తున్నట్టు, మెట్రో పరుగులు, ఐటీ హంగుల మేళవింపు, ఇన్సిస్పిరేషన్, విజన్, అకౌంటబులిటీ అనే పదాలతో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని ఉప్పల శ్రీనివాస్ తన కుమారులు, సాయికిరణ్, సాయితేజ, చిత్రకారుడు వెంకటేశ్ తో కలిసి ప్రగతి భవన్ లో అందించారు. తన పట్ల చూపిస్తున్న అభిమానానికి కేటీఆర్ శ్రీనివాస్ ను అభినందించారు. 



logo