శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 19:21:36

నైట్‌షెల్టర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్‌

నైట్‌షెల్టర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌:  కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ గోల్నాకలోని నైట్‌షెల్టర్‌ను కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న  దృష్య్టా ప్రజలందరూ ఇండ్లలోనే ఉండాలని, శుభ్రంగా చేతులు కడుక్కోవాలని కాలనీవాసులకు మంత్రి సూచించారు. 

అంతకుముందు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కంట్రోల్‌ రూంలో మున్సిపల్‌ అధికారులతో సమావేశమయ్యారు. వసతిలేని వారికి నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు  భోజన వసతులు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. 
logo