బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 06, 2020 , 15:08:09

పంజాగుట్టలో స్టీల్‌ బ్రిడ్జి పనులను పరిశీలించిన కేటీఆర్‌

పంజాగుట్టలో స్టీల్‌ బ్రిడ్జి పనులను పరిశీలించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: నగరంలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లో జరుగుతున్న  స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పరిశీలించారు. శ్మశానవాటిక వద్ద ట్రాఫిక్‌ సవ్యంగా సాగేందుకు రూ. 23 కోట్ల వ్యయంతో చేపట్టిన రెండు లైన్ల ర్యాంప్‌ పనులను పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి పరిశీలించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్య ఉన్న చోట పనుల్లో వేగం పెంచాలని, మే 15 నాటికి పనులను పూర్తి చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా అమీర్‌పేటలోని జీహెచ్‌ఎంసీ అన్నపూర్ణ ఉచిత ఆహార పంపిణీ కేంద్రాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ కేంద్రంలో అందుతున్న సేవలను గురించి అక్కడున్నవారిని అడిగి తెలుసుకున్నారు.


logo