శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 16:39:00

దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌

దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: నగరంలో పలు పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులను ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెం.45లో నిర్మిస్తున్న ఫ్లైవర్‌ పనులను పరిశీలించారు. అలాగే దుర్గం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులను  మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. మే నెల నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

'తీగల వంతెన నిర్మాణం పూర్తైన తర్వాత సుందరీకరణ పనులు ప్రారంభించాలి. పనులు వేగవంతం చేసి త్వరగా ప్రాజెక్టు చేయాలి. ప్రాజెక్టు పూర్తయితే ఐటీ కారిడార్‌ వైపు వెళ్లే వాహనాల రద్దీ తగ్గుతుందని' కేటీఆర్‌ తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్‌ వెంట ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

పార్కులు.. వినోదం...తీగల వంతెనతో దుర్గం చెరువు ప్రధాన పర్యాటక కేంద్రంగా మారబోతోంది. సందర్శకులు సేద తీరేలా.. పర్యాటకులకు ఆహ్లాదం, ఆనందం పంచేలా వినూత్న థీమ్‌లతో చెరువు చుట్టూ అభివృద్ధి చేస్తున్నారు.  తీగల వంతెనపైన  వాహనాల రాకపోకలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.logo