ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 13:58:20

లింక్‌ రోడ్డును ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

లింక్‌ రోడ్డును ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందకు జూబ్లీహిల్స్‌లో కొత్తగా నిర్మించిన లింక్‌రోడ్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంతి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 70 నుంచి ప్రశాసన్‌నగర్‌ నార్నె రోడ్‌ నంబర్‌ 78 వరకు రూ. 2.81 కోట్ల వ్యయంతో 0.47 కి.మీ. మేర ఈ లింక్‌రోడ్డును నిర్మించారు. దీనిద్వారా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌-దర్గారోడ్డు ద్వారా సులభంగా పాత ముంబై రోడ్డుకు వెళ్లే అవకాశం ఉంటుంది. నగరంలో మరో ఐదు లింక్‌ రోడ్లను జీహెఎంసీ కొత్తగా నిర్మించింది. 


logo