బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 03:36:11

కొనసాగుతున్న హరితోద్యమం

కొనసాగుతున్న హరితోద్యమం

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: రాష్ట్ర వ్యాప్తంగా ఆరో విడత హరితహారం కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విరివి గా మొక్కలు నాటుతున్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి మొక్కలు నాటారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో సింగోటం రిజర్వాయర్‌ సమీపంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, వికారాబాద్‌ జిల్లా చేవెళ్ల మండలం దుద్దాగు గ్రామంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొక్కలు నాటి నీళ్లుపోశారు.


logo