బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:57:34

కరీంనగర్‌లో ప్రతిరోజూ మంచినీటి సరఫరా

కరీంనగర్‌లో ప్రతిరోజూ మంచినీటి సరఫరా

  • కరీంనగర్‌లో ఇక ప్రతిరోజూ నల్లా నీళ్లు
  • రాష్ట్రంలోనే తొలి కార్పొరేషన్‌గా ఘనత.. భవిష్యత్తులో 24/7 సరఫరా
  • రాష్ట్రంలో తొలి కార్పొరేషన్‌గా ఘనత

కరీంనగర్‌ ప్రతినిధి,నమస్తే తెలంగాణ: ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయం నెరవేరింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌ ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆయన కల తీరింది. ఈ మేరకు కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి రోజూ మంచినీటి సరఫరా కార్యక్రమం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. కరీంనగర్‌ను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతోపాటు రూ.109 కోట్ల నిధుల కేటాయింపులు, ప్రతిరోజూ తాగునీరు ఇచ్చేందుకు కావాల్సిన ప్రణాళికలు, ఆదేశాలు ఇలా అన్నింటిలోనూ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలతో పూర్తిచేసిన నేపథ్యంలో ఈ పథకానికి ‘కేసీఆర్‌ జలం.. ఇంటింటికీ వరం’ అని నామకరణం చేశారు. మంగళవారం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రతిరోజూ మంచినీటి సరఫరా చేసే తొలి నగరపాలక సంస్థగా కరీంనగర్‌ రికార్డును సొంతం చేసుకొన్నది. మున్ముందు 24/7 నీటి సఫరా చేసేందుకు సమాయత్తమవుతున్నది.  


logo