ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 16:57:21

పీవీ, ఎన్టీఆర్‌పై అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా: మంత్రి కేటీఆర్‌

పీవీ, ఎన్టీఆర్‌పై అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌:  మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ  నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ  ఎన్టీఆర్‌లపై    మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్‌ ట్విటర్లో స్పందించారు. 

'ప్రముఖ నాయకులు పీవీ  నరసింహారావు,  ఎన్టీఆర్‌లు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదని' కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను  కూల్చాలని  జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్బరుద్దీన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.