బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 01:25:12

వ్యాధిగ్రస్థుడికి కేటీఆర్‌ అండ

వ్యాధిగ్రస్థుడికి కేటీఆర్‌ అండ

శ్రస్త్రచికిత్స కోసం రూ.లక్ష ఎల్వోసీ మంజూరు

గంభీరావుపేట: ఎముకలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న యువకుడి కి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చేయూతనందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని శ్రీగాధ గ్రామానికి చెందిన 22 ఏండ్ల వేముల విశ్వనాథం ఆరునెలలుగా చాండ్రోబ్లస్టోమాతో బాధపడుతున్నాడు. ఎముకల సమస్యతో మం చానికి పరిమితమయ్యాడు. బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లుకు సమస్యను వివరించగా, ఆయన మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పం దించిన కేటీఆర్‌ గురువారం విశ్వనాథం వైద్యఖర్చుల కోసం రూ.లక్ష ఎల్వోసీని మంజూరుచేశారు. హైదరాబాద్‌లో చికి త్సపొందుతున్న విశ్వనాథంకు హన్మాం డ్లు శుక్రవారం మంజూరుపత్రాన్ని అందజేశారు. వైద్యులు శనివారం శస్త్రచికిత్స చేయనున్నారు. 


logo