e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides అన్నలా.. అండగా..

అన్నలా.. అండగా..

అన్నలా.. అండగా..
  • కష్టకాలంలో అండగా టీఆర్‌ఎస్‌ నేతలు.. బాధితులకు భరోసా
  • ఐసొలేషన్‌లో ఉంటూనే కేటీఆర్‌ సాయం
  • నిత్యం అందుబాటులో మంత్రులు కూడా..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (నమస్తే తెలంగాణ): అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు అన్ని రకాలుగా అండగా ఉంటున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు తనకు కరోనా సోకి ఐసొలేషన్‌లో ఉన్నా బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. రాష్ట్రంలోని బాధితులకే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి సహా యం కోరుతున్నవారికి సహాయం చేస్తున్నా రు. మంత్రులు, ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలు, నియోజకవర్గాల ప్రజల యోగక్షేమాల కోసం నిరంతరం తపిస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ బా ధితులకు అన్ని రకాలుగా అండగా నిలబడుతున్నారు. వివిధ దవాఖానల్లో చికిత్స పొం దుతున్నవారి ఆరోగ్యస్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

వారి కుటుంబ సభ్యులకు భరోసానిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సౌకర్యాలు కల్పిస్తున్నారు. కరోనా బాధితుల్లో మానసిక ైస్థెర్యాన్ని పెంపొందించేందుకు వరంగల్‌ ఎంజీఎం దవాఖానలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా వార్డులను తిరిగి బాధితులతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకవైపు దవాఖానల్లో ఉన్న పేషెంట్లకు ధైర్యాన్ని ఇస్తూ మరోవైపు బాధిత కుటుంబాలకు భరోసా ఇస్తున్నా రు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేందుకు ఆమె ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. దవాఖానల్లో బెడ్స్‌ అందుబాటులో లేకపోతే బాధితులను త్వరితగతిన హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు కరోనావేళ ప్రజలకు అం డగా నిలుస్తూ, భరోసా కల్పిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి…

టీకా ఉచితంగా ఎందుకివ్వరు?

మామిడిపై మహమ్మారి ప్రభావం

నేడు, రేపు టీకా బంద్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అన్నలా.. అండగా..

ట్రెండింగ్‌

Advertisement