బుధవారం 03 జూన్ 2020
Telangana - May 01, 2020 , 02:12:57

తలసీమియా చిన్నారికి కేటీఆర్‌ అండ

తలసీమియా చిన్నారికి కేటీఆర్‌ అండ

  • ట్వీట్‌కు స్పందించిన పరిశ్రమలశాఖ మంత్రి

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: తలసీమియాతో బాధపడుతున్న ఓ చిన్నారికి మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో పెయింటర్‌ పెంటేశ్‌ కుమార్తె వైష్ణవి (12) తలసీమియా బాధితురాలు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పెంటేశ్‌.. కుమార్తెకు మందులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఎండీఆర్‌ ఫౌండేషన్‌ సభ్యులు ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి.. వైష్ణవికి సాయమందించాలని కలెక్టర్‌ హనుమంతరావుకు సూచించారు. కలెక్టర్‌ సూచనతో పటాన్‌చెరు తాసిల్దార్‌ మహిపాల్‌రెడ్డి బాధితుల ఇంటికి వెళ్లి నిత్యావసర సరుకులు అందించారు. నివేదికను కలెక్టర్‌కు పంపిస్తానని, త్వరలోనే ప్రభుత్వ సాయం అందుతుందని భరోసా ఇచ్చారు. 

చేతనకు కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

కరోనా పోరులో పాల్గొంటున్న భారత వాయుసేన ఉద్యోగి కుమార్తె చేతనకు ఐటీమంత్రి కేటీఆర్‌ గురువారం ప్రథమ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ చిన్నారిని యావత్తు దేశం మనసారా ఆశీర్వదిస్తున్నదని పేర్కొన్నారు. కేటీఆర్‌ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకొన్న చేతన తండ్రి ప్రస్తుతం కరోనా కట్టడి విధుల్లో ఉన్నారని, జన్మదినం సందర్భంగా చేతనను ఆశీర్వదించాలని ఆమె తల్లి ట్వీట్‌ చేశారు. స్పందించిన కేటీఆర్‌ చేతనకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కరోనా వైరస్‌ కోరల నుంచి అతిచిన్న వయసు పాప క్షేమంగా బయటపడటంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. 


logo