బుధవారం 03 జూన్ 2020
Telangana - May 12, 2020 , 17:29:30

కేటీఆర్‌ ఔదార్యం.. అక్కకు ఉద్యోగం.. చెల్లి చదువుకు హామీ

కేటీఆర్‌ ఔదార్యం.. అక్కకు ఉద్యోగం.. చెల్లి చదువుకు హామీ

కరీంనగర్: చొప్పదండి మండలం కాట్నపల్లికి  చెందిన అక్కా చెల్లెళ్లు సమత, మమతల తల్లి దండ్రులు అనారోగ్య కారణాలతో  మృతి చెందడంతో వారు అనాథలుగా మారిన విషయం తెలిసిందే. కాగా వీరి ధీనస్థితిని పత్రికల ద్వారా తెలుసుకున్న పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ వారిని ఆదుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ను కోరారు. ఈ మేరకు అక్కాచెల్లెల్లో ఒకరైన సమతకు మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు  ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, కరీంనగర్ మండలం ముగ్ధుంపూర్ లో డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తున్నట్లు బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అలాగే ఆమె చెల్లెలు మమతకు ముగ్దుంపూర్ లోని కస్తూర్బా పాఠశాలలో చదువు చెప్పిస్తున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులు కలెక్టర్ శశాంక, చొప్పదండి ఎమ్మెల్యే సుంక రవిశంకర్ సమక్షంలో మంత్రి కమలాకర్‌ సమతకు అందించారు.


logo