ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 11, 2020 , 03:52:20

ఐఐటీ విద్యార్థినికి మంత్రి కేటీఆర్‌ చేయూత

ఐఐటీ విద్యార్థినికి మంత్రి కేటీఆర్‌ చేయూత

  • రెండో ఏడాది ల్యాప్‌టాప్‌, ఇతర ఖర్చులకు రూ.1.50 లక్షలు అందజేత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/హసన్‌పర్తి: ఓ నిరుపేద విద్యా ర్థిని ఉన్నత చదువు నిమిత్తం మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఐఐటీ పూర్తయ్యే వరకు ఖర్చు భరిస్తానని గతంలో ఇచ్చిన హామీమేరకు ఏటా సాయం చేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తికి చెందిన ఆటోడ్రైవర్‌ మేకల రమేశ్‌ కూతురు అంజలి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఐఐటీలో సీటు సాధిం చింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సాయం చేయాలని గత ఏడాది కేటీఆర్‌ను ట్విట్టర్‌లో అంజలి కోరింది. గత ఏడాది లక్ష రూపాయలు అందజేయ గా, ఈసారి లక్ష రూపాయలతో పాటు ల్యాప్‌టాప్‌ కొనుగోలుకు మరో రూ.50 వేలు మొత్తంగా రూ.1.50 లక్షలు అంద జేశారు. ఈ మొత్తా న్ని సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో అందజేశారు.  logo