ఆదివారం 01 నవంబర్ 2020
Telangana - Oct 01, 2020 , 15:07:55

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. ఓటు న‌మోదు చేసుకున్న కేటీఆర్

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. ఓటు న‌మోదు చేసుకున్న కేటీఆర్

హైద‌రాబాద్ : ర‌ంగారెడ్డి - మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ - హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ర్ట మంత్రి కేటీఆర్ త‌న ఓటును న‌మోదు చేసుకున్నారు. సంబంధిత ప‌త్రాల‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స్థానిక డిప్యూటీ క‌మిష‌న‌ర్‌కు కేటీఆర్ అంద‌జేశారు. ఉన్న‌త విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు త‌మ పేరును త‌ప్ప‌కుండా గ్రాడ్యుయేట్ ఓట‌రు లిస్టులో న‌మోదు చేసుకోవాల‌ని కేటీఆర్ సూచించారు. 

న‌గ‌రంలోని జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన ఓటును న‌మోదు చేసుకోగా, మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి సూర్యాపేట‌లో త‌న ఓటును న‌మోదు చేసుకున్నారు. మంత్రులు త‌మ ప‌త్రాల‌ను సంబంధిత అధికారుల‌కు అంద‌జేశారు.