గురువారం 28 మే 2020
Telangana - May 21, 2020 , 17:30:02

ఖాజాగూడ చెరువును సుందరీకరించండి..

ఖాజాగూడ చెరువును సుందరీకరించండి..

హైదరాబాద్‌ : నగరంలోని ఖాజాగూడ చెరువుతో పాటు దాని పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు సూచించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు మీ ముందు ఉంచుతానని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఖాజాగూడ చెరువు పరిసరాలను ఎమ్మెల్యే గాంధీ, మేయర్‌ రామ్మోహన్‌తో కలిసి కేటీఆర్‌ పరిశీలించారు. 

పాత ముంబయి హైవేను రోడ్‌ నం-45, ఖాజాగూడ, ప్రశాసన్‌ నగర్‌ వరకు అనుసంధానించే లింక్‌ రోడ్ల పురోగతని కేటీఆర్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలో 40కి పైగా లింక్‌ రోడ్ల పనులు యుద్ధప్రతిపాదికన జరుగుతున్నాయని కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కింద ఈ లింక్‌ రోడ్డు పనులు జరగడం సంతోషంగా ఉందన్నారు. 


logo