శనివారం 30 మే 2020
Telangana - May 17, 2020 , 02:01:33

వలస కూలీలకు కేటీఆర్‌ భరోసా

వలస కూలీలకు కేటీఆర్‌ భరోసా

  • రాష్ర్టానికి రప్పించేలా మంత్రి చర్యలు
  • ట్విట్టర్‌లో విజ్ఞప్తులకు తక్షణ స్పందన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వివిధ రాష్ర్టాల్లో చిక్కుకున్న తెలంగాణ వలస కార్మికులను స్వస్థలాలకు రప్పించేలా ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చర్యలు చేపడుతున్నారు. ట్విట్టర్‌ వేదికగా చేస్తున్న విజ్ఞప్తులకు స్పందిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. పనుల కోసం గుజరాత్‌లోని సూరత్‌కు వలస వెళ్లి చిక్కుకున్నామని, తిండి లేక బతుకు దయనీయంగా మారిందని, తమను తెలంగాణకు తీసుకెళ్లాలని మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలానికి 34 మంది వలస కూలీలు శనివారం మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌లో కోరారు. కూలీ పనుల కోసం ముంబైకి వెళ్లామని, పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమను తెలంగాణకు తీసుకెళ్లాలని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన దాదాపు 25 మంది వీడియో సందేశం ద్వారా వేడుకున్నారు. స్పందించిన కేటీఆర్‌.. అక్కడి అధికారులతో మాట్లాడి వారు వచ్చేందుకు చర్యలు చేపట్టాలని డీజీపీకి సూచించారు.logo