వరద ప్రభావిత కుటుంబాలన్నింటికీ ఆర్థికసాయం : కేటీఆర్‌

Oct 31, 2020 , 21:15:34

హైదరాబాద్‌ : వరద ప్రభావిత కుటుంబాలన్నింటికీ ఆర్థికసాయం అందిస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వరదల్లో నష్టపోయిన ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. పలు ప్రాంతాల్లో ఆర్థికసాయం అందలేదన్న ఫిర్యాదులు వచ్చాయని ఈ నేపథ్యంలో ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని మరికొన్ని రోజులు పొడిగించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. వరద సాయంపై రేపు(ఆదివారం) రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. వరద బాధిత కుటుంబాలను జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికే గుర్తించి సాయం అందించారన్నారు. అయినప్పటికీ ఇంకా ఎవరైనా బాధితులుంటే వారికి కూడా నగదు సాయం అందిస్తామన్నారు. 

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD