బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 16:59:35

మీరాచోప్రాకు సత్వర న్యాయం చేస్తాం... కేటీఆర్‌

మీరాచోప్రాకు సత్వర న్యాయం చేస్తాం... కేటీఆర్‌

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపుల సమస్యపై ట్విట్టర్‌లో కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది నటి మీరా చోప్రా. గత కొద్ది రోజులుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు తనపై అసభ్యకర కామెంట్లు, ట్వీట్లు చేస్తున్నారని మీరా చోప్రా ఫిర్యాదు చేసింది. ఈ విషయమై హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్ళింది. తన ట్వీట్‌లో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తారని నమ్ముతున్నానని మీరా చోప్రా పేర్కొంది. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బాధ్యులపై సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ, నగర కమీషనర్‌లను ఆదేశించినట్లు కేటీఆర్‌ తన ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. ఇంత త్వరగా సమస్యపై స్పందించినందుకు మంత్రి కేటీఆర్‌కు నటి మీరా చోప్రా ధన్యవాదాలు తెలిసింది.


logo