శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 03:02:18

ఓఆర్‌ఆర్‌ వరకూ సీసీటీవీ నిఘా

ఓఆర్‌ఆర్‌ వరకూ సీసీటీవీ నిఘా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ నగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్‌)కు లోపల అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయి భద్రతకు, పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలరోజుల వ్యవధిలో ఓఆర్‌ఆర్‌ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ బుధవారం దీనిపై ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు సీసీటీవీ నిఘా కెమెరాలు లేని ప్రాంతాల్లో పోలీస్‌శాఖ సమన్వయంతో నెలరోజుల వ్యవధిలోనే వాటిని ఏర్పాటుచేయాలని అన్ని ప్రభుత్వశాఖలను ఆదేశించారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు, రైల్వే, టీఎస్‌ఆర్టీసీ తదితర ప్రభుత్వశాఖలు, విభాగాలు ఇందులో భాగస్వాములు కావాలని, పోలీస్‌శాఖ సమన్వయం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు


logo