బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంటా..ఇన్సూరెన్స్ ఏజెంటా..?

హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జుమ్మెరాత్ బజార్లో మంత్రి కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని ప్రధాని మోదీ చెప్పారు. మీలో ఎవరికైనా 15లక్షలు వచ్చాయా? అని కేటీఆర్ అడిగారు.
'ఢిల్లీ బాయ్స్ కావాలా.. గల్లీ బాయ్స్ కావాలా.. ప్రజలు నిర్ణయించుకోవాలి. వరదలు వచ్చినప్పుడు కేంద్రం నుంచి ఎవరూ రాలేదు. ఎన్నికలు రాగానే కేంద్రం నుంచి గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే వాళ్లు ఇరానీ చాయ్ తాగి..బిర్యాని తిని వెళ్లండి. కేంద్రం తెలంగాణకే బాకీ ఉందన్న విషయాన్ని అమిత్ షా తెలుసుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం చేసిందో వంద చెప్తా? హైదరాబాద్‌కు బీజేపీ ఏం చేసిందో ఒక్కటైనా చెప్తారా? బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంటా..ఇన్సూరెన్స్ ఏజెంటా?' అని కేటీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
- ఇక నుంచి వీళ్లూ పన్నుకట్టాల్సిందే...?
- కంబోడియాలో క్రేజీ ‘బీరు యోగా’!
- చెన్నైలోనే ఐపీఎల్ -2021 వేలం!
- వాట్సాప్ కు ధీటుగా సిగ్నల్ ఫీచర్స్...!
- పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్
- ఇక మొబైల్లోనే ఓటరు గుర్తింపు కార్డు
- ఎయిర్‌పోర్ట్‌లో రానా, మిహీక
- చిరుతను చంపి.. వండుకుని తిన్న ఐదుగురు అరెస్ట్
- పాయువుల్లో బంగారం.. పట్టుబడ్డ 9 మంది ప్రయాణికులు
- వాళ్లను చూస్తే కాజల్‌కు మంటపుడుతుందట..