గురువారం 28 మే 2020
Telangana - May 10, 2020 , 18:22:00

సీజనల్‌ వ్యాధుల నివారణ కార్యక్రమానికి విశేష స్పందన

సీజనల్‌ వ్యాధుల నివారణ కార్యక్రమానికి విశేష స్పందన

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతి ఆదివారం పది గంటలకు- పది నిమిషాలు పేరిట ప్రత్యేక సీజనల్‌ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. ఆదివారం ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ఇళ్లలో ఈ కార్యక్రమంలో పాల్గొని నీరు నిల్వలేకుండా, చెత్తను ఏరి ఇంటి పరిసరాలు శుభ్రం చేశారు.  దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు   పురపాలక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. 


logo