మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 12:24:12

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కృష్ణారెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కృష్ణారెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం : త్వరలో జరుగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో ప్రారంభించారు.నూతన పట్టభద్రులకు దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్‌దే విజయమన్నాన్నారు. పట్టభద్రులు అందరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు.

కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాలోతు భోజనాయక్, ఎమ్మెల్సీ ఎన్నికల మండల కోఆర్డినేటర్ సారేపల్లి శేఖర్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్  లింగయ్య, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, గానుగుపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, సీనియర్ నాయకులు పవన్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


logo