ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 00:49:22

తగ్గిన కృష్ణమ్మ జోరు

తగ్గిన కృష్ణమ్మ జోరు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కృష్ణా బేసిన్‌లో వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్వల్పంగానే కొనసాగుతున్నది. జూరాలకు వరద స్వల్పంగా పెరిగింది. గురువారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 22 వేల క్యూసెక్కులు నమోదైంది. శ్రీశైలం జలాశయానికి గురువారం సాయంత్రానికి 17,334 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. గోదావరి బేసిన్‌లోని సింగూర్‌కు 7,330 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. logo