శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 01:34:35

నెమ్మదించిన కృష్ణమ్మ

నెమ్మదించిన కృష్ణమ్మ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గత కొన్నిరోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త నెమ్మదించిం ది. మంగళవారం ఆల్మట్టి, నారాయణపుర మినహా దిగువన అన్ని ప్రాజెక్టులకు వరద భారీగా తగ్గింది.  ఎగువ నుంచి ఇంకా వరద వచ్చే సూచనలు ఉండటంతో కర్ణాటక అధికారులు ఇన్‌ఫ్లోకంటే అవుట్‌ఫ్లోను పెంచారు. ఆల్మట్టికి లక్షన్నర క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, దిగువకు 1.75 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపుర, జూరాల వద్ద సైతం తక్కువగా ఇన్‌ఫ్లోలు నమోదవుతున్నాయి. శ్రీశైలానికి మంగళవారం ఉదయం రెండు లక్షల క్యూసెక్కులు న్న వరద సాయంత్రానికి 1.19 లక్షల క్యూసెక్కులకు తగ్గింది.  ఏపీ అధికారులు శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు అవుట్‌ఫ్లోను గణనీయంగా తగ్గించారు. ప్రాజెక్టులో కేవలం అర అడుగు మాత్రమే కుషన్‌ ఉండగా.. లక్ష క్యూసెక్కులకుపైగా వరద వస్తుంటే అవుట్‌ఫ్లో కేవలం 31వేల క్యూసెక్కులు మాత్రమే నమోదవుతుంది. దీంతో నాగార్జునసాగర్‌కు మంగళవారం ఉదయం వరకు లక్ష క్యూసెక్కుల వరకు ఉన్న ఇన్‌ఫ్లో సాయంత్రానికి కేవలం 31వేల క్యూసెక్కులకు పడిపోయింది.  గోదావరి బేసిన్‌లో వరద స్థిరంగా కొనసాగుతున్నది. శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లికి వరద తగ్గింది. 


logo