సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 01:29:51

83 టీఎంసీలు కేటాయించండి

83 టీఎంసీలు కేటాయించండి

  • కృష్ణాబోర్డును కోరిన తెలంగాణ ఈఎన్సీ

హైదరాబాద్‌, జనవరి 8 (నమస్తే తెలంగాణ): వచ్చే మూడు నెలల్లో రాష్ర్టానికి 83 టీఎంసీల జలాలను కేటాయించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను తెలంగాణ కోరింది. మొత్తం కేటాయింపుల్లో డిసెంబర్‌ 31 వరకు వినియోగం, మార్చి 31 వరకు కావాల్సిన కేటాయింపులపై ఇండెంట్‌ ఇవ్వాలని ఏపీ, తెలంగాణకు లేఖలు రా సింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు 83 టీఎంసీలు కేటాయించాలని ఈఎన్సీ మురళీధర్‌ విజ్ఞప్తిచేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 157 టీఎంసీలు. ఇందులో ఇప్పటివరకు 74 టీఎంసీలను వినియోగించుకున్నట్టు పేర్కొన్నారు. మిగతా 83 టీఎంసీలను వచ్చే మూడు నెలల్లో విడుదల చేయాలని కోరారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం 108.50 టీఎంసీల జలాలు కేటాయించాలని ఆ రాష్ట్ర ఈఎన్సీ నారాయణరెడ్డి కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. ఇప్పటివరకు 234.12 టీఎంసీలు వినియోగించుకున్నామని పేర్కొన్నారు. వరదల సమయంలో మళ్లించిన 125 టీఎంసీల జలాలను మినహాయించాలని విజ్ఞప్తిచేశారు. 

విశాఖకు తరలింపునకు బోర్డు ఓకే

కృష్ణాబోర్డు కేంద్ర కార్యాలయాన్నివిశాఖపట్నానికి తరలించేందుకు బోర్డు సమ్మతించినట్టు సమాచారం. విభజన చట్టం ప్రకారం బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. 


logo