మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 04:05:47

తెలంగాణకు 38.. ఏపీకి 17 టీఎంసీలు

తెలంగాణకు 38.. ఏపీకి 17 టీఎంసీలు

  • నీటివిడుదల ఉత్తర్వులు జారీచేసిన కృష్ణా బోర్డు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నుంచి తెలుగురాష్ర్టాల వినియోగంపై ఈ నీటి సంవత్సరంలో కృష్ణాబోర్డు తొలి ఉత్తర్వులను జారీచేసింది. రెండురాష్ర్టాల ఈఎన్సీలతో సంప్రదింపుల తర్వాత తెలంగాణకు 37.672, ఏపీకి 17 టీఎంసీలను కేటాయిస్తూ బోర్డు సభ్యకార్యదర్శి హరికేశ్‌మీనా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 3వ తేదీ నీటిలెక్కల ఆధారంగా వీటిని కేటాయించారు. ఎండీడీఎల్‌ ఎగువన శ్రీశైలంలో 29.679, నాగార్జునసాగర్‌లో 80.761 టీఎంసీలు కలిపి 110.440 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గత నీటిఏడాదికి సంబంధించి తెలంగాణ కోటాలోని 51 టీఎంసీలను ఈ ఏడాది వాడు కొనేందుకు ఏపీ అంగీకరించడం లేదని తెలిపారు. ఈ అంశంపై త్రిసభ్య కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.
logo