ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 10, 2020 , 02:41:56

నదిలో తేలిన సంగమేశ్వరాలయం

నదిలో తేలిన సంగమేశ్వరాలయం
  • పౌర్ణమి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు

కొల్లాపూర్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో కృష్ణానది (అవతలి భాగం)లో మునిగి ఏడునెలల తర్వాత బయల్పడిన సంగమేశ్వరాలయంలో పౌర్ణమి సందర్భంగా సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీలోని కర్నూల్‌ జిల్లా ఆత్మకూరు తాలూకా పరిధిలో ఉన్న ఆలయం కృష్ణానదిలో ప్రతి ఏడాది వరద వచ్చినప్పుడు మునిగిపోతుంది. ప్రస్తుతం వరద త గ్గుముఖం పట్టడంతో సంగమేశ్వర ఆలయం నీటినుంచి తేలింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ ప్రాంత ప్రజలు పూజలు నిర్వహించారు. సోమశిల నుంచి మరబోటులో అవతలి వైపు ఉన్న ఆలయానికి చేరుకొని శివలింగానికి పూజలు చేశారు. 


logo