మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 02:57:21

కృష్ణా ప్రవాహాల వివరాలివ్వండి

కృష్ణా ప్రవాహాల వివరాలివ్వండి

  • మిగులు జలాల లెక్కతేలుస్తాం
  • ఏపీ సర్కార్‌కు కృష్ణాబోర్డు లేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలుగు రాష్ర్టాల్లో కృష్ణాబేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యా రేజీల్లోకి గత 20 ఏండ్లుగా వచ్చిన నీటి ప్రవా హం, వాటి వినియోగం.. దిగువకు విడుదల చేసిన వరద వివరాలు ఇవ్వాలని కోరుతూ కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శి హరికేష్‌మీనా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి గురువారం లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చే వివరాల ఆధారంగా మిగులు జలాల లెక్క తేలుస్తామని పేర్కొన్నారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ గేట్లను ఎత్తేసి వరద జలాలు సముద్రంలోకి కలుస్తు న్న సమయంలో.. దిగువ ప్రాంతాలకు ముం పు ముప్పును తప్పించటానికి పులిచింతలకు ఎగువన రెండు రాష్ర్టాల్లో ఎవరు నీటి ని మళ్లించినా వాటిని ఆ రాష్ట్రం కోటాగా లెక్కించొద్దని  జవవరి1న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో ఏపీ సర్కార్‌ ప్రతిపాదించింది. దాంతో ఈ అంశంపై అధ్యయనా నికి కేంద్ర జలసంఘం ఐఎంవో విభాగం సీఈ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ మే 15న తొలిసారి సమావేశమైంది. జలాల వివరాలు అందజేస్తే అధ్యయనం చేసి రెండో స మావేశం నిర్వహించి మిగులు జలాల లెక్క తేలుస్తామని ఇరు రాష్ర్టాలకు కృష్ణాబోర్డు తెలిపింది.


logo