శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 09:23:52

వేములవాడ రాజన్న ఆలయంలో కోజాగిరి వేడుకలు..

వేములవాడ రాజన్న ఆలయంలో కోజాగిరి వేడుకలు..

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కోజాగిరి పౌర్ణమి వేడుకలను శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో కౌముదినీ పూజ నిర్వహించి అనంతరం భక్తులు పాలల్లో చంద్ర దర్శనం చేసుకుని తన్మయత్వం చెందారు.


ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో.. 

జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శేషప్ప కళావేదిక వద్ద వేడుకలు ఘనంగా కొనసాగాయి. భక్తులు పాలల్లో చంద్ర దర్శనం చేసుకున్నారు. స్థానిక కళాకారులు నిర్వహించిన భక్తి సంగీత విభావరి కార్యక్రమం అలరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.